Thursday , November 23 2017
Home / Tollywood / సంక్రాంతి బరిలో సీనియర్ హీరోలు..

సంక్రాంతి బరిలో సీనియర్ హీరోలు..

సంక్రాంతి బరిలో సీనియర్ హీరోలు

ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో కొందరు టాలీవుడ్ స్టార్ హీరోలు పోటీ పడుతుండడం సహజమే. కానీ ఈ ఏడాది మాత్రం స్టార్ హీరోల సినిమాలేవీ సంక్రాంతి బరిలో లేవు కానీ ప్రేక్షకుల్లో ఈ ఏడాది మంచి ఉత్కంఠ నెలకొంది దీనికి కారణం చాలా ఏళ్ళ తరువాత సీనియర్ హీరోల మధ్య ఈ సంక్రాంతి కి రసవత్తర పోటీ నెలకొననుండడమే.  ముఖ్యంగా ఈ పోటీ లో మెగా స్టార్ చిరంజీవి తన 150 వ చిత్రం ‘ఖైదీ నెం 150’ తో బరిలోకి దిగుతుండగా, నందమూరి నట సింహం బాలకృష్ణ తన 100 వ ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ తో పోటీ పడబోతున్నాడు. వీరిద్దరితో పాటు కింగ్ నాగార్జున కూడా తన భక్తి రస  చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’ తో ఈ సంక్రాంతి కి కూడా మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నాడు. అందుకే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారని సమాచారం. మరి చిరు బాలయ్య తో పాటు నాగ్ కూడా ఈ సంక్రాంతి బరిలో దిగితే సీనియర్ హీరోల మధ్య గట్టి పోటీ జరగనుంది.  చాలా ఏళ్ళ తరువాత ఇలా సీనియర్ హీరోలు పోటీ పడనుండడం తో అందరిలో ఈ పోటీ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఈ పోటీ లో మన సీనియర్ హీరోలు ఎలాంటి ఘన విజయాలు సాధిస్తారో? వేచి చూడాలి..

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *