Wednesday , April 17 2024
Home / Reviews / ‘జనతా గ్యారేజ్’ రివ్యూ

‘జనతా గ్యారేజ్’ రివ్యూ

'జనతా గ్యారేజ్' రివ్యూ

నటీ నటులు : ఎన్.టి.ఆర్,మోహన్ లాల్, సమంత,నిత్య మీనన్ తదితరులు
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : తిరు
నిర్మాణం : మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు :నవీన్ యర్నేని,వై. రవి శంకర్ , సి.వి.మోహన్
కథ- స్క్రీన్ ప్లే-దర్శకత్వం :కొరటాల శివ
విడుదల తేదీ : 01-09-2016

కథ :
సత్యం(మోహన్ లాల్) అనే వ్యక్తి ఆటో మొబైల్ వర్క్ చేసే ఓ వ్యక్తి తన తమ్ముడి కోరిక మేరకు తన కుటుంబం తో పల్లెటూరి ను విడిచి హైదరాబాద్ సిటీ లో తన బంధువులతో కలిసి ‘జనతా గ్యారేజ్’ అనే ఓ పెద్ద గ్యారేజ్ ను ప్రారంభించి అందులో వెహికల్స్ ను రిపేర్లు చెయ్యడం తో పాటు తమ వద్దకు వచ్చి సాయం కోరే వ్యక్తులకు కూడా సాయపడుతుంటాడు సత్యం. ఈ క్రమం లో సత్యం తన మంచి తనం తో వ్యాపారాలకు అడ్డు వస్తున్నాడని భావించిన ముకేశ్(సచిన్ ఖేడ్కర్)సత్యం పై అటాక్ చేస్తాడు. ఇదే సమయం లో ముంబై లో నివసిస్తూ భూమిని, ప్రకృతి ప్రేమిస్తూ వాటిని కాపాడుకోవడం తో జీవితాన్ని గడిపే ఆనంద్ (ఎన్.టి.ఆర్) ఓ సందర్భం లో ముంబై నుండి హైదరాబాద్ వస్తాడు.. అలా వచ్చిన ఆనంద్ జనతా గ్యారేజ్ లోకి ఎలా అడుగుపెట్టాడు? సత్యం పై కక్ష సాధిస్తున్న ముకేశ్ ముకేశ్ ఆగడాలను ఎలా అడ్డుకున్నాడు? అనేదే ఈ చిత్ర కథాంశం.

నటీ నటుల పనితీరు :
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సరి కొత్త లుక్ తో పాటు తన దైన శైలి ఎమోషన్ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. తన నటనా స్థాయిని ఆనంద్ పాత్రతో మరో సారి బయట పెట్టాడు. ఇక సత్యం పాత్ర లో మోహన్ లాల్ నటన అద్భుతం అనే చెప్పాలి. ఒక మంచి వ్యక్తి గా సహజ నటనతో పాత్రకు న్యాయం చేశారనే చెప్పాలి. బుజ్జి పాత్ర లో సమంత తన గ్లామర్ , యాక్టింగ్ తో ఆకట్టుకుంది. నిత్య మీనన్ తన పాత్ర కు న్యాయం చేసింది. ఇక సచిన్ తన పాత్రకు న్యాయం చేసాడనే కానీ ఒక పవర్ ఫుల్ విలన్ గా ఆకట్టుకోలేక పోయాడు. ఇక సాయి కుమార్, అజయ్,బెనర్జీ తదితరులంతా తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నీషియన్స్ పని తీరు :
ఈ సినిమాకు ముఖ్యంగా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ హైలైట్ అనే చెప్పాలి. తీరు తన కెమెరా తో సినిమాకు అందం తీసుకొచ్చారు. ముఖ్యంగా ముంబై లొకేషన్స్, కొన్ని యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చూపించారు. దేవి అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా ‘ప్రణామం’, ‘జయ హో జనతా’ పాటలు ఆకట్టుకున్నాయి. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని సందర్భాలలో కొరటాల మాటలు ఆకట్టుకున్నాయి. మైత్రి మోవి మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా గ్రాండియర్ గా ఉన్నాయి.

Filmyship సమీక్ష :
గత రెండు చిత్రాల్లో మంచి పాయింట్ తో కమర్షియల్ సన్నివేశాలను జోడించి రూపొందించి వరుస విజయాలు అందుకున్న కొరటాల శివ ఈ సారి కేవలం రెండు పాత్రల పైనే బాగా ఫోకస్ చేసి మిగతా కధాంశం లో పెద్దగా జాగ్రత్త్త తీసుకోలేదనే చెప్పాలి. ఆనంద్ అనే ప్రకృతి ప్రేమికుడిగా ఎన్.టి.ఆర్ ను సరికొత్త కోణం లో ఆవిష్కరించిన తీరు అభిమానులను అలరిస్తుంది. ఇక మొదటి భాగం సత్యం,ఆనంద్ ల పాత్రలకు సంబంధించి డీటెయిల్స్ ఇచ్చేసిన కొరటాల ఈ పాత్రలతో కథను అల్లిన తీరు కాస్త రొటీన్ అనిపించింది. మొదటి భాగం లో ఓ 20 నిముషాలు అలరించిన జనతా రెండో భాగం లో కేవలం కొన్ని సన్నివేశాలతోనే అలరిస్తుంది. ముఖ్యంగా రెండో భాగం లో జి.హెచ్.ఎం.సి ఆఫీస్ లో ఉండే ఎమోషన్ తో కూడిన సన్నివేశం సినిమాకు కాస్తో కూస్తో బలం అనే చెప్పాలి. ఓవరాల్ గా ఎమోషన్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ పరవాలేదనిపిస్తుంది.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *